NTV Telugu Site icon

Komati Reddy Venkat Reddy: టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది

Komatireddy Venkat Redddy

Komatireddy Venkat Redddy

టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవ చేసారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామంలో ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలతో నిర్మించ‌నున్న‌ సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ఫిల్టర్ వాటర్ ప్లాంటులను ఆయన ప్రారంభించారు. ఆయ‌న మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టు పూర్తి చేస్తే వెంకట్ రెడ్డికి పేరు వస్తోందని సీఎం కేసీఆర్ కక్ష కట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడం లేదని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి ఐయ్యేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. మంత్రి పదవి కూడా వచ్చేదని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చెయ్యడం ఇష్టం లేదని కొనియాడారు.

read also: Live : 1986 నాటి భద్రాచలంను తలపిస్తున్న ఉగ్రగోదావరి

ఇంత వర్షం వచ్చిన మా ప్రాజెక్ట్ చుక్క నీరు రాలే, కానీ లక్షనర కోట్ల రూపాయలను కాళేశ్వరం పేరుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషివి ఐతే ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని మండిప‌డ్డారు. నీళ్లులేని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి తప్ప ఉన్న ప్రాంతంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడుతున్నారని మండిప‌డ్డారు. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాపిచ్చుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉంది కాబట్టే ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తాం అంటున్నారని ఎంపీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవాలని ప్రజలు చూస్తున్నారని, స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటిస్తాన‌ని అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వెచ్చే విధంగా కృషి చేస్తామ‌ని తెలిపారు. శ్రీశైలo సొరంగ మార్గం, బ్రాహ్మణ వేలంల ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు కాబట్టే, నల్లగొండ జిల్లాలో మొత్తం 12కు 12 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. సర్వేలు కూడా అదే చెప్పుతున్నాయంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Banned Words in Parliament: పార్లమెంట్ లో ఈ పదాలు నిషేధం.. వాడారో అంతే

Show comments