Site icon NTV Telugu

పోడు భూముల పై నిర్ణయం తీసుకోవాలి: షబ్బీర్ అలీ

పోడు భూముల పై నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్టు కాంగ్రెస్‌ పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ట్రైబల్ పేరుతో టీ.ఆర్.ఎస్ నేతలు బినామీలతో వందల ఎకరాలను కబ్జా చేయాలని చూస్తు న్నారని ఆయన ఆరోపించారు. కలిసొచ్చే పార్టీలతో వాచ్ డాగ్ మాదిరిగా లోకల్‌గా నిఘా పెడతామని తెలిపారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక కమిటీ వేశామని, దామోదర రాజనర్సింహా, చిన్నారెడ్డి, బలరాంనాయక్‌ నేతృత్వంలోఈ కమిటీ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎన్నికలు ఉన్న జిల్లా నేతలతో చర్చలు జరిపి పీసీసీకి నివేదిక ఇస్తామని తెలి పారు. నిన్న సమావేశం జరుగుతున్న సమయంలో జనగామ జిల్లా నేతల తీరుపై క్రమశిక్షణ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుం టుందని షబ్బీర్‌ అలీ తెలిపారు.

Exit mobile version