Site icon NTV Telugu

Congress Mahesh Kumar Goud : అసైన్డ్ భూమి ఆక్రమణలో అధికార పార్టీ నేతలే

Mahesh Kumar

Mahesh Kumar

అసైన్ట్‌ భూముల వ్యవహారంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూమిని అడ్డగోలుగా రాయించుకుంటున్నారని, నిషేదిత జాబితాలో చేర్చి.. లాక్కుంటున్నారని ఆరోపించారు. 111 జీవో కూడా ఎత్తివేతలో కుట్ర దాగివుందని, ముందుగానే వేలాది ఎకరాలు తక్కువ ధరకు కొని 111 జీవో ఎత్తేశారని ఆయన ఆరోపించారు. అసైన్డ్ భూమి ఆక్రమణలో అధికార పార్టీ నేతలే వున్నారని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వాళ్లకు కావాల్సిన వాళ్ళకే దోచిపెడుతుందన్నారు.

అనంతరం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల భూములను ప్రభుత్వ అవసరాలకే కాకుండా ప్రైవేటు రియల్ ఎస్టేట్ లకు తీసుకుంటున్నారని, రైతులను ఇబ్బందులు పెట్టి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. సీలింగ్ యాక్ట్ భూములు కూడా ప్రభుత్వం లాక్కుంటుంది..దీనిని కోట్లకు ప్రయివేటుకు అమ్ముకుంటుంది.. భూములు లాక్కుంటున్నా వారికి కాంగ్రెస్ అండగా ఉంటుంది.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే భూముల సమస్యలు ఉన్నాయి.. అందుకే ఇక్కడ భూపోరాటలు జరుగుతున్నాయి.. భూములు లాక్కున్న ప్రాంతాలను కిసాన్ కాంగ్రెస్ సందర్శిస్తుందన ఆయన వెల్లడించారు.

Exit mobile version