Site icon NTV Telugu

Renuka Choudhary: మునుగోడు కాంగ్రెస్ అడ్డా.. గెలుపు మాదే..

Renuka Choudhary

Renuka Choudhary

Renuka Choudhary: మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని.. అక్కడ హస్తం పార్టీదే గెలుపు అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రచారానికి వెళ్తానని ఆమె ప్రకటించారు. పెళ్లి కాదు.. పిలిస్తేనే వెళ్లాలి అనడానికి తప్పకుండా వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామన్నారు. సమన్వయం లోపం కాంగ్రెస్‌లో కొత్తేమీ కాదన్న ఆమె.. స్థానిక నాయకులు పనిచేయక పోతే వాళ్లకు కూడా ఇబ్బందేనన్నారు.

మునుగోడులో కాంగ్రెస్‌ గెలిస్తే ఇంకో పది మంది గెలుస్తారని.. ఓడిపోతే అందరికీ దెబ్బేనన్నారు. ఖమ్మంలో హత్యకు కొత్త కాదని.. వీటిని కాంగ్రెస్ కూడా ఎదుర్కొందన్నారు. ఈటల ఈత రాక బీజేపీ గట్టు ఎక్కరని ఆమె ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఏదేమైనా మునుగోడులో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న రేణుకా చౌదరితో ఎన్టీవీ ముఖాముఖి.

Exit mobile version