Site icon NTV Telugu

Madhu Yaskhi: తమ్ముడు తారక.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక

Madhuyashki

Madhuyashki

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రంతో వరదలు భీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.అయితే ఈ వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటను కోల్పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, భారీ వర్షాలు పడినప్పటికీ .. రాష్ట్రంలో పెద్దగా పంటనష్టం జరుగలేదని , పంట నష్టం జరిగినట్లు తనకు సమాచారం అందలేదని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ట్వీటర్‌ వేదికగా..విమర్శల వర్షం కురిపించారు. కల్వకుంట్ల తారకరామారావుకు కనీసం కల్వకుంట్ల తారకరామారావుకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా?? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read also: Nokia C21 Plus: నోకియా నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. సూపర్ ఫీచర్స్

అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాలు ఉంటే.. మతిస్థితిమితం తప్పిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ్ముడు తారక రామారావు.. నీకు తెల్వకుంటే అధికారులను అడిగి జర తెల్సుకో.. అంటూ ట్విటర్‌ వేదికగా విమర్శల వర్షం కురిపించారు మధుయాష్కి. పంటన నష్టం జరిగి రైతులు బాధపడుతుంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం సరికాదన్నారు. కడుపు మండిన అన్నదాతలు మీ.. సర్కార్‌ను గోదాట్లో కలిపిస్తారంటూ ట్విటర్‌ వేదిక విమర్శించారు. అయితే గురువారం (నిన్న) సిరిసిల్ల జిల్లాలో ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Exit mobile version