Site icon NTV Telugu

తెలంగాణలో ఉన్న భూములని వేలం వేయడమే ప్రభుత్వ ఎజెండా…

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములని వేలం వేయాలని ప్రభుత్వ రహస్య ఎజెండా పెట్టుకుంది అని అన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. భూముల వెలం ఆపాలని కిసాన్ కాంగ్రెస్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి లేఖ రాసాము. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో వెలం వేస్తుంటే మేము అడ్డుకున్నాము. ఆంధ్ర పాలకులు ప్రజల ఆస్తులు అమ్మారు అని కెసిఆర్ ప్రజలని రెచ్చగొట్టారు. అటవీ భూములని పెదలకి ఇచ్చాము. రెవిన్యూ లో ఉన్న రహస్య ఎజెండా ఇదే ..భూముల వివరాలు తెలుసుకున్నారు. ఏ ప్రభుత్వం అయిన రైతుల దగ్గర సేకరించిన భూములు ఏ అవసరాలకి తీసుకుంటారో వాటికే ఉపయోగించాలి. లేకపొతే ఐదు సంవత్సరాల తరువాత అ భూములు రైతులకే ఇచ్చేయాలి అని తెలిపారు.

రాష్ట్రంలో వెలం వేయడానికి అనుకూలమైన భూములు లేవు. భూములా వేలం వేసే చోట టీఆరెస్ నేతలు తక్కువ రేటుకే భూములు కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వేలంకి వెళితే మా పార్టీ లోని నాయకులనే అడ్డుకున్నం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రియల్స్టెట్ వ్యాపారులుగా మారారు. భూముల్ని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదు. భూముల వెలం ని ఉపసంహరించుకోవాలి. ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటే మంత్రులు ఎం చేస్తున్నారు. ఇది మీ అయ్యా జాగీరా అన్నారు. ఈటల కి వచ్చిన పరిస్థితి మిగతా మంత్రులకి కూడ వస్తుంది అని పేర్కొన్నారు.

Exit mobile version