Site icon NTV Telugu

Jeevan Reddy: ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సామాజిక తెలంగాణకు విరుద్ధం

Jeevan

Jeevan

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం విద్యార్థులు, నిరుద్యోగుల కోసమే అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ కేజీ – పీజీ ఉచిత విద్య అందరికి సమకూరుతుందన్న ప్రభుత్వం ఆ విధంగా నడుచుకోవడం లేదన్నారు. మన ఊరు మన బడి నామ మాత్ర ప్రకటనలకే పరిమితం అయింది..ఆంగ్ల మాధ్యమం, ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు.

విద్యా వాలంటీర్లను తీసుకోలేదు.. ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకం చేపట్టడం లేదు.. యూజీసీ ఆంక్షలు విధించేలా చేస్తున్నారు.. నిన్నటి ప్రయివేటు యూనివర్సిటీ బిల్లుల వల్ల విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అవుతాయి. ప్రయివేటు విశ్వవిద్యాలయల ఏర్పాటు తో నాణ్యమైన విద్య అందుతుందని చెబుతూ నిన్న మరో 5 విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వమే ప్రయివేటు విద్య కు తెరలేపుతుందన్నారు.

సామాజిక తెలంగాణ కు ఇది విరుద్ధం అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో కేవలం 25 శాతం మాత్రమే తెలంగాణ స్థానికులకు ఉండే విధంగా ఉంది.. దళితులు,బలహీన ,అల్ప సంఖ్యాక వర్గాల వారికి చదువికోవడానికి, బోధనకు రిజర్వేషన్లు లేవు.. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో కల్పించాల్సిన అంశాలు రావడం లేదని చర్చకు పెడుతూ ఉద్యమ ఆకాంక్ష కు నీరు గారుస్తుంది. ప్రయివేటు మెడికల్ కాలేజీలలో చేరికలకు సంబంధించి A కేటగిరి లో మాత్రమే స్థానికులకు సీట్లు..

B – 4౦ శాతం,C-10 శాతం లో తెలంగాణ కు ఎలాంటి రిజర్వేషన్లు లేవు.. దీంతో జాతీయ స్థాయిలో సీట్లు అమ్మకానికి పెడుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్,ఒడిశా, జమ్మూ కాశ్మీర్ లో B, C కేటగిరీలో స్థానికులకు అవకాశం కల్పించారు. కానీ తెలంగాణలో అలా జరగడం లేదన్నారు జీవన్ రెడ్డి.

Read Also: Krishna Vrinda Vihari: ఆసక్తి రేకెత్తిస్తున్న నాగశౌర్య మూవీ టైటిల్ సాంగ్!

Exit mobile version