Site icon NTV Telugu

బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు : జగ్గారెడ్డి

బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు… పవర్ అంతా.. ఢిల్లీ చేతిలోనే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస.. బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. గల్లీలో బండి సంజయ్ సీఎం నీ గల్లీలో బండ బూతులు తిడతారు. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు.. బండి సంజయ్ ఇప్పటికీ సీఎంని జైల్లో పెడతా అని రెండు వందల అబద్ధాలు అడి ఉంటారు అని తెలిపారు. పులి.. మేక ఆటలో బండి సంజయ్ బలి అయిపోతారు. ఇక్కడ గల్లీలో సంజయ్ తిడుతున్న సమయంలో… ఢిల్లీ బీజేపీ నాయకులతో కేసీఆర్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ అమిత్ షా ఆటలో బండి సంజయ్ బలి కాక తప్పదు అని అన్నారు.

Exit mobile version