మునుగోడు బైపోల్ పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. ఇవాళ సాయంత్రం 5గంటలకు టెన్ జన్ పథ్ లోని సోనియా గాందీ నివాసంలో తెలంగాణ పీసీసీ నేతలతో మునుగోడు ఉప ఎన్నికలపై ప్రియాంక గాంధీ సమీక్షించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికతోపాటు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నాయకుల మధ్య విభేదాలపై చర్చించే అవకాశం వుందని తెలిస్తోంది. ఈనేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్లపై సీనియర్ నాయకుల విమర్శలపై కూడా డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర్ రాజనర్సింహ మీటింగ్ హాజరుకానున్నారు. ఈసందర్బంగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలు దేరారు. నేతల్లో అసంతృప్తిని చల్లార్చేపనిలో పార్టీ అధిష్టానం. ఢిల్లీ రావాలని టీపీసీసీ నేతలకు హైకమాండ్ పిలుపునివ్వడంతో.. వారు ఢిల్లీకి పయనమయ్యారు.
Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితదే ముఖ్యపాత్ర.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
