NTV Telugu Site icon

Congress Ex MLA Anil Kumar: పార్టీని బలి చేయకండి.. రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు

Anil

Anil

Congress Ex MLA Anil Kumar: రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారని, కలిసి పనిచేద్దాం పార్టీని బలి చేయకండని కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ మండిపడ్డారు. టీడీపీ వాళ్లకు పదవులు ఇచ్చారని సీనియర్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లు కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీస్తున్నరని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న సమయం లో కొందరు నాయకులు పార్టీని బలహీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు,పాదయాత్ర కు శ్రీకారం పెట్టబోతున్నారని అన్నారు. మహేశ్వర రెడ్డి ముసుగు వీరుడు, మూడు నెలలకు ఒక్క సరి బయటకు వచ్చి మాట్లాడుతాడన్నారు. సునీల్ కనుగొలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం పని చేస్తారని తెలిపారు. ఉత్తమ్ సునీల్ పై ఆరోపణలు చేస్తున్నారు.

Read also: College Fee Tragedy: కన్న కూతురికి కాలేజీ ఫీజు కట్టలేక తండ్రి ఆత్మహత్య

ఆధారాలు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. సీవీ ఆనంద్ టీఆర్ఎస్ యక్టివిస్ట్, ఆయన చెబితే ఉత్తమ్ నమ్ముతారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్ గోపాల్ ను గెలిపించాలని వెంకట రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఈ ఆరుగురు నేతలు ఎందుకు మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు. మునుగోడులో సీనియర్లు కొందరు లోపయికారి ఒప్పందం చేసుకున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీల్ ఆఫీసుపై పోలీసులు దాడులు చేస్తే ఈ సీనియర్లు ఎక్కడ ? ఎవరితో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావలను దెబ్బతీసే ప్రయత్నం ఈ సీనియర్లు చేస్తున్నారని తెలిపారు. 2018 లో ఉత్తమ్ స్వార్థం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు ఏమో టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులా అని ఉత్తమ్ అంటారా ? అని ప్రశ్నించారు. ఉత్తమ్ పిసిసి చీఫ్ దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. టీడీపీ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎన్ని డబ్బులు ఉత్తమ్ జేబులో వేసుకొనున్నవి చెప్పు అని మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు.

Read also: ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న టాప్-10 వ్యక్తులు వీరే..

గూడూరు నారాయణ రెడ్డిని బీజేపీ లోకి పంపింది ఉత్తమ్ కుమార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి కోవర్ట్ గా పనించేసిండు కాబట్టి టీఆర్ఎస్ లో చేరిన వెంటనే MLC ఇచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి నీ ఫోన్ లో అందుబాటులో ఉండాలని కోరుతున్నామని తెలిపారు. సీనియర్ లను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కలిసి పనిచేద్దాం…పార్టీని బలి చేయకండని వేడుకున్నారు. ముసుగు వీరుడు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి…ఎట్టకేలకు బయటకు వచ్చారని ఆరోపణలు గుప్పించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోవర్ట్ కాదా ? మునుగోడులో ఆయన ఏమి చేశారు? అని ప్రశ్నించారు. వెంకట్ రెడ్డి పై ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని అనుకుంటే…ఈ సీనియర్లు అడ్డుకుంటున్నారని తెలిపారు అనిల్‌. ఎలక్షన్ ఫండ్ గురించి ఉత్తమ్ ఏ గుడికి వచ్చి ప్రమాణం చేయాలని, నేను అక్కడ మాట్లాడడానికి రెఢీ అంటూ సవాల్‌ విసిరారు అనిల్‌.