NTV Telugu Site icon

Congress First List: కాంగ్రెస్, సీపీఐ పొత్తు.. రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ

Congress Cpi

Congress Cpi

Congress First List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించగా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. కమ్యూనిస్టులతో పొత్తు కుదిరిన తర్వాత సీట్ల సర్దుబాటు అనంతరం మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమె తెలిపారు. కాగా, కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా సీపీఐ పార్టీకి 2 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చెన్నూరుతో పాటు కొత్తగూడెం టిక్కెట్లను ఆ పార్టీకి కేటాయించాలని నిర్ణయించారు.

పొత్తుపై సీపీఎం నేతలతోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. పొత్తుల లెక్కలు పక్కాగా ఉంటే ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయించి అధికారికంగా ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పొత్తుల్లో భాగంగా సీపీఐకి టికెట్‌ కేటాయిస్తారనే ప్రచారం సాగింది. ఇటీవల చర్చల్లో టికెట్ కేటాయించకపోవడంతో ఆ పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. మునుగోడు సీటు ఇవ్వడంపై నల్గొండ సీపీఐ నేతలు మండిపడుతున్నారు. మునుగోడును కొత్తగూడెంకు వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. కమ్మ నాయకుడికి బీసీ నేత బలి పశువు అని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో తమకు టికెట్ కేటాయించకుంటే సొంతంగా పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.
Saindhav : టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్..