NTV Telugu Site icon

Telangana Congress: జీహెచ్ఎంసీ ఆఫీస్‌ ముందు ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

Ts Congress

Ts Congress

Telangana Congress: భారీ వర్షాల కారణంగా వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే వరద బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు.

Read also: TS Rains: తెలంగాణలో వర్ష బీభత్సం.. రికార్డు బద్దలు కొట్టిన వర్షపాతం

వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు గన్ పార్క్ నుంచి జీహెచ్ ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కొందరు గేటు ఎక్కి ఆఫీసులోకి వెళ్లారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎదుట ధర్నాకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ నగరంలో దాదాపు వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా వరద బురదలో చిక్కుకుపోయారు. వరద బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేడు జీహెచ్‌ఎంసీ ముట్టడికి పిలుపునిచ్చింది.
Jampanna River: ఉదృతంగా జంపన్న వాగు.. వరదలో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్లు