NTV Telugu Site icon

Osmania University: సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు.. ఓయూలో విద్యార్థుల ఆందోళన..

Ou Telangana

Ou Telangana

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సిలబస్ పూర్తి చేయకుండానే పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. UGC నిబంధనల ప్రకారం, సెమిస్టర్‌లో కనీసం 120 పనిదినాల తర్వాత పరీక్షలు నిర్వహించాలి. కానీ ఓయూ అధికారులు మాత్రం రెండు నెలలైనా పాఠాలు చెప్పకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Read also: Dhruva Natchathiram : ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయిన చియాన్ విక్రమ్ సినిమా..

సిలబస్ పూర్తయిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. పరీక్షల నిర్వహణపై వారం రోజుల క్రితం వీసీకి వినతిపత్రం పంపినా స్పందన రాలేదు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్‌కు వెళ్తున్న విద్యార్థులను ఓయూ సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్‌లో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఓయూలో ఇవాళ(బుధవారం) జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించారు. వర్షంలోనూ విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
Kohli-Sachin: అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ!