హైదరాబాద్ శివారులోని శంషాబాద్ దగ్గర జరిగిన దిశ ఎన్‌కౌంటర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది… అయితే, దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టింది కమిషన్.. ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.. అందులో భాగంగా ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించనున్నారు అధికారులు.. ఇక, ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మాట్లాడిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు.. తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కమిషన్ విచారణ కోసం రోజు వస్తున్నాం.. లోపల ఏది అడిగినా సమాధానాలు చెబుతామన్నారు.. ఇప్పటికే కొడుకులను కోల్పోయామని కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు.. ఎవరికి భయపడేది లేదని స్పష్టం చేశారు.. మిమ్మల్నీ చంపుతామని బెదిరిస్తున్నారని.. ఈ విషయాన్ని కమిషన్ ముందు చెప్పామని.. దీంతో పోలీసులను కూడా ఇచ్చారన్నారు. అయినా ఇంకా ప్రాణం భయం పోలేదన్నారు. ఇక, తప్పు చేసిన వారికి శిక్షపడాలని డిమాండ్ చేశారు.
దిశ ఎన్‌కౌంటర్ కేసు.. చంపుతామని బెదిరిస్తున్నారు..!
