Site icon NTV Telugu

హైదరాబాద్‌ అంబేద్కర్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభం

గ్రేటర్ హైద్రాబాద్ లో నేటి నుంచి దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే PV మార్గ్ అంబేద్కర్ నగర్ లో GHMC నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు KTR , తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పీవీ మార్గ్ లో ఈ ఇళ్ళకు కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటుందని.. పేదల కోసం ప్రభుత్వం ఇల్లు కట్టిచ్చిందని పేర్కొన్నారు.

read more : తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం : పువ్వాడ అజయ్‌

ఇల్లు మేమే కట్టిస్తాం.. ఆడబిడ్డ పెళ్లి మేమే చేస్తాం.. అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇల్లు కట్టిస్తున్నామని వెల్లడించారు. ముఖ్య మంత్రి కి చెట్లు పెంచటం ఇష్టమని… పచ్చదనం పెంచాల్సిన బాధ్యత ఆడబిడ్డలదేనన్నారు. హుస్సేన్ సాగర్ లో చెత్త వేయొద్దని.. ఇంకొరిని వేయనివ్వొద్దని సూచనలు చేశారు. మోడల్ కాలనీ లాగా పరిసరాలు ఉండాలని తెలిపారు.

Exit mobile version