Site icon NTV Telugu

Telangana Assembly Sessions: అసెంబ్లీకి రండి చర్చిద్దాం.. వీఆర్ఏలను ఆహ్వానించిన కేటీఆర్

Ktr

Ktr

Come to the assembly and discuss.. KTR invited VRAs: వీఆర్‌ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. వీఆర్‌ఏలతో చర్చలకు సిద్ధమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో 15 మంది వీఆర్ఏలతో కేటీఆర్ భేటీ అయ్యారు. VRAలను ఇతర శాఖల్లో భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పడంతో ఇవాళ వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పే స్కేల్ అమలు చేస్తామని గత అసెంబ్లీ సెషన్ లో కేసీఆర్ హామీ ఇచ్చి పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు. అర్హులైన వారికి ప్రమోషన్స్‌ ఇవ్వాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే

గత అసెంబ్లీ సమావేశాల్లో pay స్కెల్ ప్రకారం జీతం ఇస్తాం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ ఆరోపించారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూడడంతో VRA లు ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇతర శాఖలో VRA లను భర్తీ చేస్తాం అని కేసీఆర్ ప్రకటించడంతో.. కేసీఆర్ స్టేట్మెంట్ తో సిటీ లో ఆందోళన వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి vra లు వరుసగా పిలుపు నిచ్చారు. అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసుల మెహరించడంతో.. ప్రగతి భవన్ నుంచి అసెంబ్లీ దారి పొడవు ఉన్న షప్స్ ని క్లోస్ చేస్తున్నారని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ముట్టడికి వస్తున్నా వందలాది మంది VRA లను ఎక్కడిక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లయి ఓవర్ దగ్గర 200 మంది VRA లను అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు. నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు.
CM Help: అర్థరాత్రి కారు ప్రమాదం.. కాన్వాయ్​ ఆపి భరోసా ఇచ్చిన సీఎం..

Exit mobile version