రేపు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేయనున్నారు. ఉదయం 11 నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయి. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్, సైబరాబాద్ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. మాసాబ్ ట్యాంక్ నుంచి రోడ్ నెం. 12 వరకు వచ్చే ట్రాఫిక్ ని బంజారాహిల్స్ రోడ్ నెం.10 క్యాన్సర్ హాస్పిటల్ వైపు మళ్లించనున్నారు. ఫిల్మ్‌నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్టీఆర్‌భవన్ వైపు మళ్లిస్తారు.