Site icon NTV Telugu

Anganwadi Centers: రంగు పడుద్ది.. ఆ గుడ్లపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ముద్ర

Angan Vadi

Angan Vadi

Anganwadi Centers: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అంగన్‌వాడీల్లో పోషకాహార కిట్‌లను అందజేస్తుంది. మధ్యాహ్న భోజనం, గుడ్లు కూడా అందిస్తున్నారు. కాగా.. అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నిత్యం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే.. అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన గుడ్లు దారిమళ్లుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలో పంచుతున్న గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు రంగుల ముద్రలు వేయాలని నిర్ణయించింది సర్కార్. గుడ్లు పక్కదారి పట్టకుండా రంగుల స్టాంపులు వేయాలని నిర్ణయించారు. జోన్ నంబర్‌తో కూడిన గుడ్లకు ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Read also: Yogi Adityanath: పాకిస్తాన్ వెంట ఎవరు ఉండరు.. పీఓకే భారత్‌లో భాగం కావాలనుకుంటోంది..

ఈ గుడ్లకు నెలకు మూడుసార్లు రంగులు వేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. మొదటి 10 రోజులలో నెమలి నీలం, రెండవ 10 రోజులలో ఎరుపు, మూడవ 10 రోజులలో ఆకుపచ్చ రంగు. ఇది గుడ్డు బరువు, ఎత్తు మరియు పొడవుకు సంబంధించి స్పష్టమైన నియమాలను నిర్దేశిస్తుంది. అగ్మార్క్ నిబంధనల ప్రకారం గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు ఉండాలని స్పష్టం చేశారు. 10 గుడ్లను ఒక యూనిట్‌గా పరిగణిస్తే వాటి బరువు 450 గ్రాముల నుంచి 525 గ్రాముల వరకు ఉండాలి. గుడ్డులోని తెల్లసొన పగలకుండా చూసుకోవాలని సూచించారు. గుడ్డు 16 మి.మీ వ్యాసం, 3 మి.మీ ఎత్తు ఉండాలని స్పష్టం చేశారు. గుడ్లు సరఫరా చేసే కంపెనీ గోదాముల్లో గుడ్ల నాణ్యత కోసం ల్యాబ్ ఉండాలి. పంపిణీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు రిజిస్టర్‌ను నిర్వహించాలని సిఫార్సు చేయబడింది. తక్కువ బరువు, నాణ్యత లేని గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ టెండర్లను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
Priya Prakash Varrier Cleavage Pics: ప్రియా ప్రకాష్ వారియర్ క్లీవేజ్‌ షో.. హాట్ గ్లామర్‌తో పిచ్చెక్కిస్తున్న వింక్ గర్ల్!

Exit mobile version