Cold Wave in Adilabad: తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో.. చలి తీవ్రత పెరుగుతుంది. నిన్నటి తో పోలిస్తే చలి ఇవాళ ఎక్కువైంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత లు మళ్లీ సింగిల్ డిజిట్ కు రావడంతో.. కొమురం భీం జిల్లా లో 9.7గా నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో 10.9, మంచిర్యాల జిల్లా లో 11.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా లో 12.5 కాగా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్ళీ పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇక మెదక్ జిల్లా దొంగల ధర్మారంలో 14.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. దీంతో జిల్లాల ప్రజలు చలితో వణుకుతున్నారు. మళ్లీ పగటి ఉష్ణ్రోగలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని రగ్గులు కప్పకున్న నరాలు తెగే చలి వణుకు పుట్టిస్తోందని జిల్లా ప్రజలు తెలుపుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో.. తెల్లవారు జామున చలి తీవ్రతకు పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
Prabhas: ఆదిపురుష్ అవుట్… సలార్ ఇన్