తగ్గినట్టే తగ్గిన చలి.. తెలంగాణలో మళ్లీ పంజా విసురుతోంది.. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు అవుతున్నాయి.. జిల్లాలోని అర్లీ(టీ)లో 4.9 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు.. కుమరంభీంలో 5.8, సిర్పూర్ (యు)లో 5.8, గిన్నెధరిలో 6.0, సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో 6.2 డిగ్రీలలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
Read Also: కోవిడ్‌పై షాకింగ్ స్టడీ.. కొందరిలో 7 నెలలకు పైగానే యాక్టివ్‌గా..!
మొత్తంగా మళ్లీ తెలంగాణపై చలి పంజా విసురుతోంది.. పెద్దపల్లి, హన్మకొండ జిల్లాల్లో ఏకంగా 6 నుంచి 8 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 30.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు చెబుతున్నారు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. దీంతో.. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించే పరిస్థితి నెలకొంది.