తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు కొరత లేదని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్టాలకు సైతం తగినంత బొగ్గు సరాఫరా చేస్తున్నట్టు తెలిపారు. రానునున్న రోజుల్లో బొగ్గు నిల్వలను పెంచడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తున్నామన్నారు. సింగరేణి భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి సంస్థ డైరెక్టర్లు,11మంది ఏరియాల జనరల్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. నవంబర్ నుంచి రోజుకు 2లక్షల బొగ్గు రవాణా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
బొగ్గు కొరత లేదు.. సింగరేణి సీఎండీ
