Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read also: 50 Years Of Alluri Sitarama Raju: కృష్ణ అల్లూరి సినిమా గురించి ఈ నిజాలు తెలుసా?

మే డే అనేది కార్మికుల పండుగ. అన్ని వర్గాల కార్మికులు మే డేను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. అని మార్క్సిస్టు నాయకుడు కార్ల్‌మార్క్స్‌ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచిందన్నారు.. వారిని మరింత పోరాటంలో నడిపించిందని తెలిపారు. వందలాది మంది కార్మికుల రక్తంతో తడిసిన రుమాలు తీసి కార్మిక జెండాగా ఎగురవేసిన ఆనాటి నుంచి మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎందరో తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించి శ్రమదోపిడీపై విజయం సాధించారు. అనేపథ్యంలోనే 1886 మే 1, 1886 నుండి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని రేవంత్ తెలిపారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు.. టీ20 ప్రపంచకప్‌లో రాణిస్తాడు!

Exit mobile version