CM Revanth Reddy: నేడు సీఎం పుట్టినరోజు.. యాదాద్రిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.
- నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ యాదగిరిగుట్టకు బయలుదేరనున్న సీఎం..
- తన జన్మదినం సందర్భంగా 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి దర్శనం- పూజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టతో పాటు వలిగొండ మండలం సంగెం అండర్ బ్రిడ్జి వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన వివరాలు..
Also Read
* ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. కుటుంబ సమేతంగా ఉదయం 9.20 గంటలకు హెలిప్యాడ్‌లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు.
* హెలిప్యాడ్ నుంచి ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు వాహనాలు యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుంటాయి.
* ఉదయం 10.00 గంటల నుంచి 11.15 గంటల వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
* 11.20 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుని 11.30 నుంచి ఒంటి గంట వరకు ఆలయ అభివృద్ధి పనులపై వీటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
* మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు భోజనం. 1.30 గంటలకు వలిగొండ మండలం సంగెం ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
* మధ్యాహ్నం 2.10 నుంచి 3 గంటల వరకు బిమలింగం వద్ద పూజల్లో పాల్గొని నడక సాగిస్తారు.
* మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు రెండున్నర కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. 4.30 గంటలకు ధర్మారెడ్డి కాలువ మీదుగా సంగెం-నాగిరెడ్డిపల్లి ప్రధాన రహదారికి చేరుకుంటారు.
* అనంతరం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు నాగిరెడ్డిపల్లిలో వాహనంపై నుంచి ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు సంగెం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి…
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగానికి పూజలు చేసిన అనంతరం పునరుజ్జీవం యాత్ర చేపడతారు. ఈ మేరకు భీమలింగం వరకు రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ధర్మారెడ్డి కాలువ మీదుగా సీఎం యాత్ర చేపట్టనున్నారు. భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం దర్శనార్థం విష్ణుపుష్కరిణి, అఖండ దీపం, తూర్పు రాజగోపురం మీదుగా ఆలయంలోకి సీఎం భద్రతా సిబ్బంది వెళ్లి స్వయంభువుల దర్శనం, వేద ఆశీర్వాద మండపం, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పూజలు చేసే భీమలింగం వరకు సీఎం వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు.
Astrology: నవంబర్ 08, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?