NTV Telugu Site icon

CM Revanth Reddy: కౌంటింగ్ విషయంలో జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్..

Cm Revanth Reddy Zoom Meeting

Cm Revanth Reddy Zoom Meeting

CM Revanth Reddy: నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కౌంటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కీలక సూచనలు జారీ చేశారు.

Read also: Harish Rao: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరం..

ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కించాక ఈవీఎం ఓట్ల లెక్కించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలన్నారు. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోవాలని సూచించారు. ప్రతీ రౌండ్ లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతీ అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలన్నారు.
Kajal Aggarwal: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న కాజల్ అగర్వాల్