Site icon NTV Telugu

CM Revanth Reddy: ఇంద్రవెల్లి నుంచే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం..!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి తొలి సభ జరగనుంది. ఫిబ్రవరి 2న రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించి సీఎం అయిన తర్వాత తొలి సభను అక్కడే నిర్వహించబోతున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలను ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ సెంటిమెంట్‌గా మారింది.

Read also: Budget 2024 : ఫోటో సెషన్, రాష్ట్రపతితో మీటింగ్.. నేటి ఆర్థిక మంత్రి షెడ్యూల్ ఇదే

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యం..

రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద స్మారక వనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్మృతి వనం శంకుస్థాపనకు స్వయంగా వస్తానన్నారు. దీని ప్రకారం ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు.దీంతో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా నాగోబాను దర్శించుకోనున్నారు. నాగోబాను సందర్శించనున్న తొలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం. సీఎం రాకతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించనున్నారు. ఆదిలాబాద్ నేతలకు మంత్రి సీతక్క పలు సూచనలు చేశారు. ఇంద్రవెల్లి సభను లోక్‌సభ ఎన్నికలకు శంఖారావ సభగా కాంగ్రెస్ పరిగణిస్తోంది. రాష్ట్రంలోని 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. కాగా.. గతంలో దళిత గిరిజనుల దండోరాను విజయవంతం చేసిన విధంగానే రేవంత్ సభను విజయవంతం చేయాలని మండల స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇకనైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా 40 ఏళ్ల ఇంద్రవెల్లి ఘటనలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షుడిగా చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Medaram Jatara: తెలంగాణలో మేడారం జాతర సందడి.. ఈ రూట్స్‌లో స్పెషల్‌ బస్సులు

Exit mobile version