Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారిపడిన సంగతి తెలిసిందే. తుంటి విరిగిన తర్వాత యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పదిహేను నిమిషాల పాటు కేసీఆర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ తో కూడా మాట్లాడానని అన్నారు. రేవంత్ రెడ్డి వెంట షబ్బీర్ అలీ, మంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అసెంబ్లీకి తప్పకుండా రావాలని కేసీఆర్ కోరారని తెలిపారు. రేవంత్ రెడ్డి సూచనలు, సలహాలు అవసరమన్నారు.
Read also: Gutka ad case: కేద్రంకి చేరిన కేసర్ వాసన.. బాలీవుడ్ బడా హీరోలకు షోకాజ్ నోటీసులు..!
కేసీఆర్ చికిత్సకు అన్ని విధాలా సహకరించాలని సీఎస్‌ను ఆదేశించినట్లు రేవంత్ తెలిపారు. కేసీఆర్ కు సర్జరీ జరిగిందని..ఆరోగ్యం కుదుట పడిందని అన్నారు. కేసీఆర్ తొందరగా కోలుకోవాలని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలనని.. ప్రభుత్వ తరుపున సహాయసహకారాలు అందించాలని అధికారులను ఆదేశించా అని తెలిపారు. అయితే కేసీఆర్ ను కలిసేందుకు కేటీఆర్ తో సీఎం రేవంత్ వెళ్లారు. లోనికి వెళుతున్నప్పుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ భుజంపై చేయి వేసి మట్లాడుతూ వెళ్లారు. కేటీఆర్ కు ధైర్యం చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు భుజం చేయివేసుకుని వెళుతుంటే ఆపత్రిలో అందరూ ఆశక్తిగా చూశారు. ఆ తరువాత రేవంత్ కేసీఆర్ తో మాట్లాడి బయటకు వచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరానని తెలిపారు.
Sai Pallavi: క్యూట్ నెస్ తో మాయచేస్తున్న సాయి పల్లవి..