Site icon NTV Telugu

CM Ravanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన.. ఐకానిక్ ప్రదేశాల సందర్శన..

Reavanth Reddy Londan

Reavanth Reddy Londan

CM Ravanth Reddy: దావోస్ నుంచి లండన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. లండన్ టూర్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను సందర్శించారు. రేవంత్ లండన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక భవనాలు, స్మారక చిహ్నాలను సందర్శించాడు. బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జి తదితర నిర్మాణాలను చూసిన సీఎం.. దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రపై ఆరా తీశారు.

Read also: Kishan Reddy: హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదు..

తెలంగాణలోని అనేక పర్యాటక కేంద్రాల అభివృద్ధి, వాటి ద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలి అనే కోణంలో అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎం అధ్యయనం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర పర్యాటక రంగానికి గుర్తింపు, ప్రభుత్వానికి ఆదాయం, పరోక్ష ఉపాధి అవకాశాలు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత తదితరాలపై ఇప్పటికే లండన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి షా నవాజ్‌ ఖాసీం, ఓఎస్‌డీ అజిత్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి దానకిషోర్‌, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలి తదితరులు సీఎం వెంట ఉన్నారు.
Alla Ramakrishna Reddy: టీడీపీ- వైసీపీ పాలనలో విసుగు చెందిన వారంతా కాంగ్రెస్ లోకి వస్తారు..

Exit mobile version