NTV Telugu Site icon

CM Revanth Tweet: తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం.. సీఎం రేవంత్ ట్విట్‌ వైరల్‌

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Tweet: కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024ను యువకవి, రచయిత రమేష్ నాయక్‌కు అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు. పిన్నవయసులో ‘ధావ్లో’ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్‌కు అభినందనలు. ఈ అవార్డు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఇది గొప్ప గౌరవమని అన్నారు. కార్తీక్ భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేసి సాహిత్యరంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

Read also: Fake Gold: తక్కువ ధరకు బంగారం.. రూ.1.1 కోట్లు టోకరా

రమేష్ కార్తీక్ నాయక్ సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. మోజిరామ్, సెవంతబాయి దంపతులకు నునావత్ మొదటి సంతానం. డిసెంబర్ 14, 1997న జన్మించిన అసలు పేరు నునావత్ కరిర్తిక్. కథలు, వచనా కవిత్వం, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనువాద రంగాల్లో చిన్నతనంలోనే సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. రమేష్ కార్తీక్ నాయక్ రచనలు ఒక్కొక్కటి ప్రజాదరణ పొందాయి. 2014లో తొలి కవితా సంపుటిని ప్రారంభించిన రమేష్.. తాను సేకరించిన సంఘటనలు, వ్యక్తులు, ఎన్నో విషయాలు తెలుసుకుని తొలి రచన పూర్తి చేశారు. అంతేకాకుండా.. గిరిజన బతుకులు, వెతలనే కవితలు, కథలుగా చెప్పాలనుకున్నాడు. కాగా.. రమేశ్‌ రాసిన ‘బల్దేర్‌ బండి’ కవితా సంపుటి 2018లో ప్రచురితం కాగా, 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక.. ఈ వచన కవితా సంపుటి సాహితీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నది.

Read also: Deputy CM Pawan Kalyan: బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వదిన ఇచ్చిన పెన్‌తో తొలి సంతకం..!

దీంతో.. ఇంగ్లిష్‌, హిందీ, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లోకీ అనువాదమైంది. 2021లో ‘డావ్లో’ పేరుతో తీసుకొచ్చిన కథల సంపుటిలో గోర్‌ బంజారా కథలను అద్భుతంగా అక్షరీకరించాడు. ఇక..ఈ సంకలనంలోని ‘పురుడు’ కథ ఆంగ్లంలోకి అనువాదమై ‘ఎక్సేంజెస్‌’ సాహిత్యానువాద జర్నల్‌లోనూ ప్రచురితమైంది. అంతేకాకుండా.. 2022లో ఆచార్య సూర్యధనుంజయతో కలిసి సహ సంపాదకీయంలో ‘కేసులా’ పేరుతో తొలి గోర్‌ బంజారా కథలు రాశాడు. 2023లో ‘చక్మక్‌’ అనే ఇంగ్లిష్‌ కవితా సంపుటి రచించాడు. దీంతో.. 2017లో ‘కలహంస’ పురస్కారం, 2018లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం (బోధన్‌లో), 2019లో మువ్వా రంగయ్య ఫౌండేషన్‌ వారి ‘నవ స్వరాంజలి’ సత్కారం, 2019లోనే ‘చిలకమర్తి లక్ష్మీనరసింహం’ సాహితీ పురస్కారం, 2020లో ‘బీఎస్‌ రాములు’ ప్రతిభా పురస్కారం, 2021లో ‘బంజారా యూత్‌ ఐకాన్‌’ అవార్డు, 2023లో ‘రావిశాస్త్రి కథా పురస్కారం’ వరించడమే కాకుండా..గతేడాది నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘హరిదా యువ సాహిత్య’ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే.. ఈ యువ సాహితీవేత్త అక్షర సేవలకు గాను 2024 జూలై 15న ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది.జరిగింది.
నోరు తెరిచి నిద్రపోతున్నారా..? అయితే మీకు..!