Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు సచివాలయానికి సీఎం రేవంత్‌..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: నేడు సచివాలయానికి సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు.

Read also: Health Tips : రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా?

ఈ నెల 18న తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీ అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలను అధికారులతో చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌!

Exit mobile version