NTV Telugu Site icon

CM Revanth Reddy: హాట్ హాట్‌గా తొలి కేబినెట్ మీట్.. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా ఆమోదించొద్దని సీఎం ఆదేశం..

Ts Cabinet

Ts Cabinet

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దల సమక్షంలో తెలంగాణకు రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఇదిలా ఈ రోజు సాయంత్రం తొలి కేబినెట్ సమావేశాన్ని జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం హాట్ హాట్‌గా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ శాఖపై సీరియస్ రివ్యూ మీటింగ్ నడిచింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Earthquake: వనాటులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

రేపు ఉదయం విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు రూ.85 వేల కోట్ల అప్పు ఉన్నట్లు సీఎంకు అధికారులు చెప్పారు. జెన్‌కో అండ్ ట్రాన్స్‌కో సీఎండిగా ఉన్న ప్రభాకర్ రావు ఇటీవల కాంగ్రెస్ గెలుపొందడంతో రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సీఎం ఆదేశించారు. రేపటి రివ్యూ మీటింగ్‌కి ప్రభాకర్ రావును కూడా రప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలపై క్యాబినెట్ సీరియస్‌గా దృష్టి సారించింది.