Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ..!

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ దాడులు పై చర్చించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ జరగనుందని సమాచారం. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా.. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈనెల 9వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Read also: Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ను బంగ్లా గా మార్చాలని కేంద్రానికి వినతి

హైదరాబాద్ తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 12 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు కొనసాగాయి. మహదేవ్ పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో అధికారుల బృందం రికార్డులు, విలువైన పత్రాలను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇక మరోవైపు తాజాగా తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. నిన్నటి (11వ) తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికపై కూడా సమీకలో చర్చించనున్నారు.
Merry Christmas: అన్నిసార్లు వాయిదా పడినా హిట్ కొట్టారు…

Exit mobile version