CM Revanth Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో జారిపడి తుంటికి గాయమైంది. దీంతో యశోదా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసారు. హెల్త్ సెక్రటరీని సీఎం యశోద ఆసుపత్రికి పంపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు ఆరోగ్యశాఖ కార్యదర్శి వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైద్యాధికారులు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి యశోద వైద్యులు తెలిపారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నిన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారులు ఆసుపత్రికి తరలించారు.
Read also: CPM Srinivasa Rao: అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజాప్రణాళికపై సమాలోచన..
కేసీఆర్ హెల్త్ అప్డేట్..
మాజీ సీఎం కేసీఆర్ ఎడమ కాలు తుంటికి సర్జరీ అవసరం ఉందని, తుంటి మల్టిపుల్ ఫ్రాక్చర్ అయ్యిందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రీ ప్లేస్ చెయ్యాలా.. రిపైర్ చెయ్యాలా.. అనేదానిపై డాక్టర్స్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడు కొన్ని పరీక్షలు నిర్వహించారు. సర్జికల్ ప్రొఫైల్ పరీక్షలు ముగిశాయన్నారు.
స్కానింగ్ పూర్తి అయ్యింది… హిప్ రీప్లేస్ కే డాక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంటున్న వైద్యులు. కేసీఆర్ కు చేయాల్సింది మేజర్ సర్జరీనే అన్నారు. తుంటి భాగంలోని బౌల్ ను రీప్లేస్ చేస్తారని అన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని,
నిద్ర పోతున్నారని తెలిపారు. సాయంత్రం సర్జరీ చేయాలంటే కేసీఆర్ శరీరం పూర్తిగా సహకరిస్తుందా? లేదా అనేదానిపై చర్చలు జరుపుతున్నారు. బౌల్ రిప్లేస్‌మెంట్ చేసిన తరువాత మరుసటి రోజే నడిపిస్తారని వైద్యులు తెలిపారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్నారు.
RBI: మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ