Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు హుస్నాబాద్‌కు సీఎం రేవంత్‌.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Revanth Reddy

Revanth Reddy

ముఖ్యమంత్రి పర్యటనకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబయింది. నేడు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ కు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ కోసం హుస్నాబాద్ పట్టణంలోని ఏనే వద్ద మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 262.68 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారులను కాంగ్రెస్ జెండాలు, కటౌట్లతో అందంగా అలంకరించారు. బహిరంగ సభ కోసం భారీ ఎల్ఈడి స్క్రీన్ లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. సభకు తరలి వచ్చే ప్రజలకు మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Samantha–Raj : ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. !

Exit mobile version