Site icon NTV Telugu

Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. శిల్పకళావేదికలో నియామక పత్రాల కార్యక్రమం

Revanth Reddy, Logo

Revanth Reddy, Logo

Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 18న గ్రూప్-2 ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. మొత్తం 782 మంది అభ్యర్థులు ఈ సందర్భంగా తమ నియామక పత్రాలను స్వీకరించనున్నారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం

కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్‌ల పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెవెన్యూ, హోమ్, జీఏడీ శాఖల మధ్య సమన్వయం కల్పించి, అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.

KTR : ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా.. కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్‌

Exit mobile version