CM Revanth Reddy: సిఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైలు మార్గం విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. గచ్చిబోలి నుంచి విమానాశ్రయం వరకు గతంలో 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించామని… సామాన్యులకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ధనవంతులు ఉన్నందున వారు ఎక్కువగా సొంత వాహనాలనే వినియోగిస్తున్నారని తెలిపారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్ నుమా – ఎయిర్ పోర్ట్ మార్గాన్ని, ఎల్ బి నగర్ టు ఎయిర్ పోర్ట్ మార్గాన్ని ప్రజలు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాల నుంచి చాలా మంది అరబ్ దేశాలకు వెళ్తున్నారని తెలిపారు. విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు విమానాశ్రయానికి వెళ్లి సెండాఫ్ ఇచ్చేందుకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయపడ్డారు.
Read also: Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారి వేధించిన భర్త.. సుపారి ఇచ్చి చంపించిన భార్య
మూసీ నదీ పరీవాహక ప్రాంతాల అభివృద్ధి…
మూసీ నది పరివాహక ప్రాంతంలో తొలి దశలో 55 కిలోమీటర్ల మేర మెట్రోను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రింగ్‌రోడ్డు, రింగ్‌రోడ్డు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఐకానిక్ డిజైన్లతో అంతర్జాతీయ స్థాయి అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న చార్మినార్, గోల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి చారిత్రక కట్టడాలను అనుసంధానం చేసి టూరిజం సర్క్యూట్‌ను రూపొందించాలని సూచించారు. ఈ రంగాల్లో పిపిపి మోడల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయాన్ని ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాంలు నిర్మించి వాటర్ ఫౌంటెయిన్లు, జలపాతాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
Read also: Bhopal Missing Girls: భోపాల్ వసతి గృహం ఘటన.. మిస్సయిన 26మంది బాలికలు సురక్షితం
హైదరాబాద్ చుట్టూ జనావాసాలకు దూరంగా నాలుగు డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ డంప్ యార్డుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. ప్రస్తుతం హైదరాబాద్ నగరం మొత్తం జవహర్ నగర్‌లో ఒకే ఒక్క డంప్‌యార్డు ఉండగా.. జవహర్‌నగర్ డంప్‌యార్డుకు రోజుకు సుమారు 8 వేల టన్నుల చెత్త తరలిపోతోంది. ఈ డంప్‌యార్డు చుట్టు పక్కల నివసించే ప్రజలకు ఇబ్బందిగా మారింది. వాయుకాలుష్యం, దుర్వాసన వెదజల్లుతున్నాయి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో శంషాబాద్, మెదక్‌లో డంప్‌యార్డు స్థలాలను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. చెత్త నుంచి 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకోసం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను వీలైనంత వరకు రీసైకిల్ చేయాలి. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
Bangladesh Election Today: బంగ్లాదేశ్‌లోని 299 స్థానాల్లో కొనసాగుతున్న ఓటింగ్
