CM Revanth Reddy : వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వరాలు కురిపించారు. వరంగల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మాణం, స్పోర్ట్స్ స్కూల్ స్థాపనకు ఆమోదం తెలిపి సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేపూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ అభివృద్ధి అంశాలపై కలిశారు.
Indigo Flight: తిరుపతిలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం ఏర్పాటు వంటి డిమాండ్లను సీఎం వెంటనే ఆమోదించారు. ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవడంతో వరంగల్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు నగర క్రీడాభివృద్ధికి దోహదం చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
LAC: 13 వేల అడుగుల ఎత్తులో, చైనాకు చేరువలో.. అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ప్రారంభానికి సిద్ధం..
