Site icon NTV Telugu

CM KCR: ఢిల్లీకి పయనమైన అధికారులు.. పలు అంశాలపై సీఎంతో సమీక్ష

Kcr

Kcr

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థత గురయ్యారు. కేసీఆర్‌ కొద్ది రోజుల క్రితం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అనంతరం అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన అప్పటి నుంచి తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలో ఉంటున్నారు. గత.. మూడు రోజుల నుంచి సీఎం కేసీఆర్‌ అస్వస్థతతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో… తన నివాసానికే వైద్యులను పిలిపించుకుని కేసీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు. సీఎం కేసీఆర్‌ .. అనారోగ్యం రీత్యా ఆయన మరో రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఉండాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కావున.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని కేసీఆర్ ఆదేశించడంతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు స్పెషల్ ఫ్లైట్ లో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Read also: Phone : ఫోన్ తీశాడంటూ బావిలో వేలాడదీశారు.. చిన్నారిపై క్రూరత్వం

ఇక.. హైదరాబాద్ నగరం సొంతం చేసుకున్న వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్‌పై ముఖ్యమంత్రి రివ్యూ జరపనున్నారు సీఎం కేసీఆర్‌…దీనిపై సమీక్షకు హాజరవాల్సిందిగా సీఎం ఆదేశించారు. దీనికోసం వారంరోజులుగా నిన్ననే దిల్లీకి చేరుకున్నారు. ఇక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డుపై తగినంత ప్రచారం జరగలేదన్న అసంతృప్తితో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ..అవార్డుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారని సమాచారం. ఇక, వీటితో పాటు మరికొన్ని ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నాట్లు. అయితే.. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం వెళ్లిన సీఎం కేసీఆర్‌ యూపీ వెళ్లిన విషయం తెలిసిందే.. అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి హస్తిన చేరుకున్నారు. అప్పటినుంచి ఎనిమిది రోజులుగా అక్కడి ఉన్నారు సీఎం కేసీఆర్‌. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఢిల్లీ.. సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు…ఇందుకోసం జోద్‌పూర్‌ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
T20 World Cup: టీమిండియా పట్ల వివక్ష.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శల వర్షం

Exit mobile version