NTV Telugu Site icon

CM KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఎప్పుడంటే?

Cm Kcr Delhi Tour

Cm Kcr Delhi Tour

CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 1.05 గంటలకు ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయానికి కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హోమం, వాస్తు పూజలు నిర్వహించిన అనంతరం నిర్ణీత సమయం ప్రకారం మధ్యాహ్నం 1.05 గంటలకు నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలతో కేసీఆర్ గంటసేపు గడపనున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Read also: Zero Shadow day: ఈనెల 9న హైదరాబాద్ లో అద్భుతం.. 2 నిమిషాలు నీడ కనిపించదట!

ప్రారంభోత్సవం వేడుకల ఏర్పాట్లను చేసేందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. మొత్తం 1,150 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో మొత్తం 18 గదులు, సమావేశాల కోసం సమావేశ మందిరం ఉన్నాయి. కేసీఆర్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అతిథుల కోసం రెండు సూట్ రూమ్‌లతో పాటు ప్రత్యేక క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం BRS తాత్కాలిక కార్యాలయం సర్దార్ పటేల్ మార్గ్‌లో నడుస్తోంది. ఈ కార్యాలయాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ఇప్పుడు కొత్త భవనంలోని మెటీరియల్‌లను మార్చనున్నారు.
Zero Shadow day: ఈనెల 9న హైదరాబాద్ లో అద్భుతం.. 2 నిమిషాలు నీడ కనిపించదట!