NTV Telugu Site icon

KCR Warangal Tour : సాయంత్రం వరద పరిస్థితులపై సమీక్ష

Cm Kcr Warangal Tour

Cm Kcr Warangal Tour

Telangana Chief Minister K.Chandrashekar Rao Meeting Today Evening With Warangal District TRS Polictical Leaders.

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలను వరదు ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, వరద బాధితులతో మాట్లాడనున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం వరంగల్ కు చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ వరద పరిస్థితులపై వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భద్రాచలంలో పర్యటించి, వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేయనున్నారు. తగు ఆదేశాలు జారీ చేయనున్నారు.

TRS Parliamentary Party : ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

అక్కడినుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి, అక్కడ కూడా దిగి, వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. అనంతరం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తెల్లారి సోమవారం ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం,కాళేశ్వరం, తదితర వరదబాధిత ప్రాంతాలలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో భాగంగా సీఎం కేసీఆర్ వరద బాధితులను పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు.