Site icon NTV Telugu

ఈ నెల 4న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్‌…. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 4న సిరిసిల్లకు రానున్నారు సీఎం కేసీఆర్‌. ఈ పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వనున్న కేసీఆర్…. సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం. కాగా..మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ఎపిసోడ్‌ అనంతరం… వరుసగా జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇప్పటికే సిద్దిపేట, కామారెడ్డి మరియు యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. ఇందులో భాగ్గానే ఈ నెల 4న సిరిసిల్లకు రానున్నారు సీఎం కేసీఆర్‌.

Exit mobile version