తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వనపర్తికి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11:45 గంటలకు చేరుకుంటారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ‘మనఊరు – మనబడి, మనబస్తీ – మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
మధ్యాహ్నం 12:50 గంటలకు నాగవరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభించి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 3:40 గంటలకు వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించే భారీ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. కాగా సీఎం కేసీఆర్ పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
