NTV Telugu Site icon

CM KCR: ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు.. ప్రగతిభవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న కేసీఆర్‌

Kcr

Kcr

CM KCR: నేడు ప్రగతిభవన్‌ నుంచి ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్ గా ఒకేసారి తరగతులను ప్రారంభించనున్నారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నగర్‌ నాగర్‌ కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తొలి విద్యాసంవత్సరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక,జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ కలను సాకారం చేసే దిశగా అతిపెద్ద అడుగు పడబోతుంది. అయితే..ఈ 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే..తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి…ఎనిమిదేండ్లలోనే 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకొన్నాం…ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున 33 జిల్లాలకు కాలేజీలు వస్తాయి…అప్పుడు రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో..మన విద్యార్థులు వైద్య విద్యకోసం రష్యా, చైనా, ఉక్రెయిన్‌ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక..రాష్ట్రంలోనే చదివేందుకు సరిపడా సీట్లు ఉంటాయి.

read also: Krishna Padmalaya Studio : కృష్ణ సోదరుల ‘పద్మాలయ’!

అయితే..ఒక రాష్ట్రంలో ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం, మెడికల్‌ విద్యార్థులకు 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రావడం దేశ చరిత్రలోనే బహుశా తొలిసారి. ఇక మెడికల్‌ కాలేజీలో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు, అత్యాధునిక పరికరాలు ఉంటాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్‌ విద్యార్థులు, సీనియర్‌ రెసిండెంట్లు.. ఇలా భారీగా సిబ్బంది ఉంటారు. అయితే..దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇక, పెద్ద వ్యాధి వచ్చినా హైదరాబాద్‌ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే చికిత్స లభిస్తుంది. ఈనేపథ్యంలో..జిల్లాల వికేంద్రీకరణ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు సైతం జిల్లా కేంద్రాలు గరిష్ఠంగా 50-70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి…కాబట్టి అత్యవసర సమయాల్లో తొందరగా పెద్ద దవాఖానకు చేరుకోవచ్చు.
Joe Biden Meets Xi Jinping: జీ జిన్‌పింగ్‌, జో బైడెన్‌ భేటీ.. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన వీడేనా?