Secretariat: రాష్ట్ర సచివాలయం ఆవరణలో దేవాలయం, చర్చి, మసీదుల ప్రారంభోత్సవం జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించారు. ఈ సందర్భంగా నమాజ్ చేశారు. నిన్న గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ కోరారు. దీనికి గవర్నర్ తమిళిసై అంగీకరించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఒకే వేదికపై చాలా కాలం తరువాత సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలంగాణ సచివాలయం నిర్మాణ సమయంలో నల్లపోచమ్మ గుడి, మసీదు, చర్చిలను తొలగించారు. కొత్త సచివాలయంలో ప్రభుత్వం ఈ మూడు ప్రార్థనా మందిరాలను నిర్మించింది. సచివాలయానికి నైరుతి దిశలో నల్ల పోచమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంతో పాటు గణపతి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను కూడా నిర్మించారు. మునుపటి స్థలంలో మసీదులు నిర్మించబడ్డాయి. ఈ మసీదుల సమీపంలో చర్చి కూడా నిర్మించబడింది. ఇవాళ నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనల్లో కేసీఆర్, గవర్నర్ పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్, గవర్నర్లు ఒకే వేదికపై పాల్గొన్నారు.
నల్ల పోచమ్మ ఆలయంలో గవర్నర్, సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి చర్చిని ప్రారంభించారు. చర్చిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ కేక్ కట్ చేశారు. మసీదును ప్రారంభించిన అనంతరం గవర్నర్, సీఎం ప్రార్థనల్లో పాల్గొన్నారు. మసీదు ప్రారంభోత్సవంతో పాటు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. నిన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. పెండింగ్ బిల్లులు, ఎమ్మెల్సీల గవర్నర్ కోటాపై చర్చించినట్లు సమాచారం. అయితే అదే సమయంలో ఈరోజు తెలంగాణ సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా గవర్నర్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు ఇవాళ తెలంగాణ సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు.
Magni5: ఘనంగా కాగ్నిటోనిక్ సిస్టమ్స్ ఐదో వార్షికోత్సవ వేడుకలు