Site icon NTV Telugu

Rythu Runa Mafi: రుణమాఫీ చేయలేకపోతున్నా.. రైతులను ఉద్దేశించి కేసీఆర్ కీలక ప్రకటన

Rytu Runa Mafi

Rytu Runa Mafi

Rythu Runa Mafi: తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో రైతులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో రైతుల రుణాలను మాఫీ చేసింది. ఈ క్రమంలో.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ప్రభుత్వ పథకాల్లో ఒకటైన రైతు రుణమాఫీకి బ్రేక్ పడింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ ఈరోజు ఆయన పాల్గొన్న నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రతి ఒక్కరికీ సకాలంలో రుణమాఫీ చేయలేకపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే కొంతమంది రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయిందని కేసీఆర్ వివరించారు. దీనిపై కాంగ్రెస్ కూడా పిటిషన్ వేసిందని కేసీఆర్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఎన్నికలలోగానీ, ఆ తర్వాత గానీ అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే వారం పది రోజుల్లో వస్తుందని కూడా చెప్పారు. లేకుంటే పోలింగ్ ఏజెంట్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేసీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రెండు దఫాలుగా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఇందుకోసం రూ. 37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. లక్ష వరకు రుణమాఫీని అనేక దశల్లో అమలు చేయగా, లక్ష కంటే కొంచెం ఎక్కువ రుణాలు తీసుకున్న వారి రికార్డులు పూర్తిగా నిలిచిపోయాయి. వారందరి వివరాలను ప్రభుత్వం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని నిలిపివేశారు.. కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రైతుల వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి.
Kotha Prabhakar Reddy: ఎవ్వరూ రాకండి నేనే వస్తా.. కొత్త ప్రభాకర్ రెడ్డి వీడియో సందేశం

Exit mobile version