Site icon NTV Telugu

CM KCR: పోడు భూముల స‌మ‌స్యల‌కు త్వర‌లోనే ప‌రిష్కారం

Kcr Banjaras

Kcr Banjaras

తెలంగాణ రాష్ట్రంలో గిరిజ‌న బిడ్డలు ఎస్టీలు.. మ‌హారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు.. ఇలా ర‌క‌ర‌కాలుగా విభ‌జ‌న‌లో ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉండే గిరిజ‌న బిడ్డలంద‌రికీ స‌మాన హోదా వ‌చ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మ‌నం పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రక‌టించారు. హైదారబాద్‌ బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ 10లో నూత‌నంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భ‌వ‌న్‌ను ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇవాళ బంజారాహిల్స్‌లో ఇంత చ‌క్కటి బంజారా భ‌వ‌న్ నిర్మాణం చేసుకోని నాచేతులుతో ప్రారంభింప‌జేసుకున్నందుకు మంత్రి స‌త్యవ‌తి రాథోడ్‌కు, బంజారా ప్రజాప్రతినిధుల‌కు, యావ‌త్ తెలంగాణ రాష్ట్ర బంజారా బిడ్డలంద‌రికీ హృద‌య‌పూర్వకంగా, సంతోషంగా అభినంద‌న‌లు తెలియజేసిన కేసీఆర్‌.. తెలంగాణ వ‌స్తే ఏం జ‌రుగుత‌ద‌నే మాట ఉద్యమ సంద‌ర్భంలో చాలా చోట్ల చెప్తూ వ‌చ్చానని అన్నారు.

చాలా సంద‌ర్భాల్లో కూడా చెప్పానని, మ‌న రాజ‌ధాని న‌గ‌రంలో బంజారాహిల్స్ అనే గొప్ప ప్రాంతం ఉంట‌దని.. కానీ, బంజారాల‌కే గ‌జం జాగ లేద‌ని చెప్పాను. ఆ మాట తారుమారు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌర‌వం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా భ‌వ‌నం నిర్మించుకున్నాం. మ‌నం ఈ రోజు ఈ భ‌వ‌నాన్ని ప్రారంభించుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది భార‌త‌దేశ గిరిజ‌న జాతి అంద‌రికీ కూడా ఒక స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మ‌న బాట ప‌ట్టాయి. అనేక చోట్ల గిరిజ‌న బిడ్డల‌కు గౌర‌వం ల‌భించే విధంగా ద‌శ దిశ చూపిస్తుంద‌ని భావిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే.. ఉత్తమ‌మైన సేవ‌లందిస్తున్న బంజారా బిడ్డలు, ఎంతో మంది బంజారా బిడ్డలు ఉత్తమ‌మైన సేవ‌లు అందిస్తున్నారు. అనేక రంగాల్లో అనేక హోదాల్లో ప‌ని చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు.

ఇక రాష్ట్రంలోని నీటి పారుద‌ల శాఖ‌లో మ‌న బంజారా బిడ్డ హ‌రే రామ్ అందించే సేవ‌లు అద్భుత‌మైన ఫ‌లితాల‌ను ఇస్తున్నాయని అన్నారు. సుమారు 28 నుంచి 30 దేశాల్లో మాట్లాడే భాష కూడా మ‌న తెలంగాణ‌, మ‌న తండాల్లో మాట్లాడిన భాషనే అక్కడ మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యేక‌మైన‌టువంటి ఆహార్యం, ప్రత్యేక‌మైన జీవ‌న విధానం, ప్రత్యేక‌మైన సంస్కృతి, ప్రత్యేక‌మైన ప‌ద్ధతుల్లో జీవించే ఆత్మగౌర‌వం, విశిష్ఠమైన సంస్కృతిని ఆ ప‌రంప‌ర‌ను ఈ రోజు వ‌ర‌కు కూడా మ‌న బంజారా బిడ్డలు కాపాడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక పోడు భూముల స‌మ‌స్యల‌ను త్వర‌లోనే ప‌రిష్కారం చేసుకోబోతున్నామ‌ని కేసీఆర్ ప్రక‌టించారు. దీంతో.. బంజారా ప్రజాప్రతినిధులంతా యాక్టివ్‌గా ఉండి.. పోడు భూముల ప‌రిష్కారంలో చొర‌వ తీసుకోవాలి. మ‌న బిడ్డల‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని మీ అంద‌ర్నీ కోరుతున్నాను.

Solve The Problem OU Students: ఓయూ వద్ద ఉద్రిక్తత.. హాస్టళ్లు మూసివేస్తే ఎక్కడ ఉండాలి

Exit mobile version