NTV Telugu Site icon

CM KCR: నేటి నుంచి కేసీఆర్‌ రాజశ్యామల యాగం.. ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో మూడు రోజులు

Cm Kcr Rajasyamala Yagam

Cm Kcr Rajasyamala Yagam

CM KCR: సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడు సమావేశాల చొప్పున… సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ… ముందుకు సాగుతున్నారు. ఎక్కడా తగ్గకుండా ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇక నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామలయాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు రాష్ట్రపతులు పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం 200 మంది వైదికులు ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో శ్రీకారం చుడతారు. రెండో రోజు వేదపఠనం, హోమం తదితర పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు పూర్ణాహుతి ఉంటుంది. సీఎం కేసీఆర్ తన సతీమణితో కలిసి మంగళవారం రాత్రి ఎర్రవల్లి చేరుకున్నారు. మరో 29 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రాజశ్యామల యాగం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మూడు రోజులు యాగం షెడ్యూల్..

మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో శ్రీకారం
రెండో రోజు వేదపఠనం, హోమం తదితర పూజలు
చివరి రోజు పూర్ణాహుతి 

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలని 2015లో చండీ యాగం నిర్వహించారు. అనంతరం.. 2018 ఎన్నికల రెండో విడతకు వెళ్లకముందే సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి రాష్ట్రంలో అధికారం సాధించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో గులాబీ బాస్.. యజ్ఞం చేశాడు. పూర్వ కాలంలో రాజు యుద్ధానికి వెళ్లే ముందు అర్చకులతో కలిసి రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారని పురోహితులు చెబుతున్నారు. శక్తి పొందడానికి, శత్రువుల బలాన్ని తగ్గించడానికి.. ప్రజలను మంత్రముగ్ధులను చేయడానికి ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పండితులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు రాజ శ్యామలా యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం అనంతరం సహస్ర చండీ యాగం నిర్వహించారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఢిల్లీలో యాగం జరిగింది. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ దానికి ప్రతిఫలం దక్కుతుందని పార్టీ వర్గాల విశ్వాసం.
Pragathi : వామ్మో..చీరలో ప్రగతి జిమ్ వీడియో చూశారా?