NTV Telugu Site icon

సభా ప్రాంగణానికి భారీగా తరలుతున్నజనం

తెలంగాణ దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణానికి దళితులు భారీగా తరలివచ్చారు. లక్షా ఇరవై వేల మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. హుజురాబాద్ నియోజకవర్గములోని ప్రతి గ్రామం నుండి ఐదు బస్సులు, బస్సుకు 60 మంది చొప్పున సభకు అధికారులు తరలిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి 825 బస్సులు, 500 పైగా ఇతర వాహనాల్లో సభా ప్రాంగణానికి భారీగా జనం తరలుతున్నారు.