NTV Telugu Site icon

Second PRC: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. త్వరలోనే సెకండ్ పీఆర్సీ అమలుకు కసరత్తు

Cm Kcr

Cm Kcr

Second PRC: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రెండో పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇందుకోసం నెలాఖరులో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మధ్యంతర ఉపశమనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వీటి అమలుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వీటన్నింటికి సంబంధించి కార్మిక సంఘాలతో సీఎం కేసీఆర్ త్వరలో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. కార్మిక సంఘాలతో కేసీఆర్ సమావేశమై నేరుగా వారి సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే అన్నీ కుదిరితే మరో పది రోజుల్లో ఈ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం.కాగా, పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు, తాత్కాలిక పోస్టును త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో టీఎన్‌జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్‌, సత్యనారాయణగౌడ్‌ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ ప్రక్రియలోనే పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు, ఐఆర్‌ను ప్రకటించాలని కేటీఆర్‌ను కోరారు.

Read also: Period Celebrations: గ్రాండ్‌గా పీరియడ్‌ డే సెలబ్రేషన్స్.. అత్యంత పవిత్రమైనదిగా చెప్పడానికే

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 317 జియోతో తలెత్తిన ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నిబంధనలను వెంటనే చేపట్టాలన్నారు. టీఎన్జీవో నేతల ఫిర్యాదులపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌తో కార్మిక సంఘాలు సమావేశమయ్యేలా చూస్తామని నేతలకు హామీ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు, ఐఆర్‌ అంశాలపై త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రకటన చేస్తారన్నారు. ఉద్యోగుల ఆరోగ్య చికిత్స కోసం ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సిద్ధం చేశామన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టించాలని టీఎన్‌జీవో నేతల సమక్షంలోనే సీఎస్‌ శాంతికుమారికి కేసీఆర్‌ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన భూవివాదం పెండింగ్‌లో ఉందని.. ఈ భూమిని ఉద్యోగులకు పంపిణీ చేసేందుకు సీఎంతో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్వరాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి అన్యాయం జరగదని కేటీఆర్ అన్నారు. త్వరలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు వినిపించనుంది.
West Bengal: మణిపూర్ సీన్ రిపీట్.. దొంగతనం చేశారని బెంగాల్‌లో మహిళను వివస్త్రను చేసి కొట్టారు