Site icon NTV Telugu

CM KCR: మూడు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభ.. పాల్గొననున్న సీఎం కేసీఆర్‌

Cm Kcr

Cm Kcr

CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా ముదోల్, ఆర్మూరు, కోరుట్లలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మంత్రి వేముల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే ఈ కార్యక్రమానికి గ్యాలరీలు, వేదిక సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉద్యమ కాలం నుంచి బాల్కొండ బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసిన వేముల భారీ మెజార్టీతో గెలుపొందారు. మూడోసారి నిలబడ్డ ఆయన విపక్షాలకు అందనంత స్పీడ్‌గా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ సభకు జనసమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. స్వచ్ఛందంగా తరలివెళ్లే ప్రజలకు రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాకకోసం సభ ప్రాంగణం గులాబీ మాయమైంది.

సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు..

1. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజక వర్గం భైంసాలో ప్రజా ఆశీర్వాద సభ

2. నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభ

3. జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ

సీఎం కేసీఆర్ సభ సందర్బంగా కోరుట్ల వైపు వెళ్లే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల దారి మళ్లించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తులు ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.
Astrology: నవంబర్‌ 03, శుక్రవారం దినఫలాలు

Exit mobile version