NTV Telugu Site icon

ఆర్టీపీసీఆర్ టెస్టులో తేలని ఫలితం.. త్వరలో కేసీఆర్‌కు మళ్లీ పరీక్షలు…

CM KCR Tests Positive for Covid-19

తెలంగాణ సిఎం కెసిఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ కు నిన్న నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. మొన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎం.వీ. రావు తెలిపారు. కాగా సిఎం కెసిఆర్ కు ఈ నెల 19 న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.